డ్రైనేజి పూడికతీత లో భాగంగా తవ్విన మట్టిని గట్లపై ఉంచారు డ్రైనేజీ మట్టిని అర్థరాత్రి ట్రాక్ట్ర్లర్లతో తొలుతున మట్టి మాఫియా.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )న్యూస్ :-. .
కాట్రేనికోన మండల చెయ్యేరు అగ్రహారం లో డ్రైనేజీ పూడికతీత పనులు రంగరాజు ఇటీవలే నిర్వహించారు తవ్విన మట్టిని గట్లపై ఉంచారు అక్రమార్కుల కన్ను ఈ మట్టి పై పడింది దీంతో అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
ఈ విషయం డ్రైనేజీ జే ఈ కి తెలియడంతో నిఘా పెట్టారు అయితే మట్టి మా సరిహద్దు వద్ద ఉందని మట్టిని సర్దుకుంటూ న్నామని కొంతమంది రైతులు చెప్పారని. మట్టిని బయటికి తరలించి అమ్మకాలు చేస్తే వాహనాలు సీజ్ చేయిస్తామని పోలీసు కేసులు కూడా పెడతామని జె ఈ దుర్గా నాయుడు హెచ్చరించారు ప్రభుత్వానికి చెందిన మట్టిని కూడా మట్టి మాఫియా వదలడం లేదని స్థానికులు వాపోతున్నారు. మట్టిని ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కి తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు