Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఈనాటి ప్రజల సుఖం ఆనాటి స్వాతంత్ర్య సమారా యోధుల త్యాగ ఫలం “. కాకినాడ ఎంపీ వంగా గీత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, ద్వారాబందాల చంద్రయ్యల ప్రత్యేక తపాలా చంద్రికల ఆవిష్కరణ స్వాతంత్ర చరిత్రపై చెరగని సంతకం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అన్నవరం:

 

అన్నవరం, ఏప్రిల్ 19, (విశ్వం వాయిస్ న్యూస్) ;
_______________________________

“ఈనాటి స్వతంత్ర భారత ప్రజల సుఖం అలనాటి దేశ స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలం” అని కాకినాడ జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు.
స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు, ద్వారబంధాల చంద్రయ్యల ముఖచిత్రాలతో భారత తపాల శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక తపాల బిళ్లల(చంద్రికల)ను సోమవారం ఆవిష్కరించారు. మన్యం విప్లవ సారధి అల్లూరి సీతారామరాజు చేసిన రంప విప్లవంలో భాగంగా 1922 లో అన్నవరం పోలీస్ స్టేషనుపై దాడి చేసి శత వసంతాలు పూర్తి, మిరప కాయ టపా శతజయంతి సందర్భంగా భారత తపాల శాఖ తరఫున కాకినాడ జిల్లాలోని కాకినాడ డివిజన్ తపాల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షకుడు రాజా డి.యస్.యు. నాగేశ్వర రెడ్డి నేతృత్వంలో ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో విశాఖపట్నం డివిజన్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ యం. వెంకటేశ్వర్లు ఈ తపాలా చంద్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు, సంతోషాలు, స్వతంత్రత ఆనాటి సమరయోధుల జీవితాలు త్యాగం చేయడం ద్వారా వచ్చినవన్న విషయం ఎప్పటికీ మరిచి పోకూడదు అన్నారు. చరిత్ర భవిష్యత్తుకి మూలం అవుతుంది, నేటి యువత దానిని నిర్లక్ష్యం చేయ కూడదని ఆమె స్పష్టం చేశారు.

గౌరవ అతిధి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆయన చిన్నప్పుడు అల్లూరి, అలాగే ఇతర స్వాతంత్య్ర సమరయోధుల కధలను పుస్తకాల్లో చదువు కొనేప్పుడు, పెద్దలు చెప్పినప్పుడు ఎంతో ప్రేరణ కలిగేదని, ఇటువంటి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొనే ఇటువంటి కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం తన అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు చరిత్రలో తనదైన స్థానం సంపాదించు కున్నదని తెలిపారు. అన్నవరం గ్రామ ప్రధమ పౌరుడు, సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా కూడా మాట్లాడుతూ… ఇటువంటి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు భావి తరాలకు తెలియ కుండా కనుమరుగు అయి పోతున్నాయని బాధపడ్డారు. ఇటువంటి గొప్పవారు పుట్టిన ప్రాంత వాసులం కావడం మనకు గర్వకారణం అన్నారు. చంద్రయ్యదొర జీవిత చరిత్ర గురించి ప్రత్యేకంగా ఓ పుస్తకాన్ని రచించిన కోటిపల్లి సుబ్బారావుకు కుమార్ రాజా తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పోస్ట్ మాస్టర్ జనరల్ డా.యం. వెంకటేశ్వర్లు కూడా మాట్లాడుతూ ” కింగ్ ఆఫ్ హాబీస్ ” గా పిలువబడే ” ఫిలాటలీ ” యొక్క ప్రాముఖ్యత ని అందరికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తపాలశాఖ ఈ ప్రత్యేక తపాలా చంద్రికల విడుదల ద్వారా స్వాతంత్ర సమరయోధులను, వారి త్యాగాలను తరువాతి తరాలకు అజరామరంగా అందించే ప్రయత్నం చేస్తోంది అన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు రోజుల్లో గిరిజన ప్రజల మీద జరుపుతున్న బ్రిటిష్ పాలకుల అరాచకాలను అతి పిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు ఎదిరించి, తిరుగులేని, రాజీపడని స్వాతంత్య్ర సమరయోధుడు అని కొనియాడారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసే సమయంలో ఒక లేఖ, కొన్ని మిరపకాయలు కట్టిన బాణాన్ని పోలీస్ స్టేషన్ పై సంధించడం ద్వారా వారికి అల్లూరి సీతారామరాజు ముందుగానే సమాచారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టించే వారని, ఈ పద్దతే “మిరపకాయ టపా” గా ప్రాచుర్యం పొందింది అని వివరించారు. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన పోలీసు స్టేషన్ల ప్రాంతాలపై ఇప్పటి వరకు నాలుగు ప్రత్యేక చంద్రికలు విడుదల చేశామని, ఇది ఆ వరుసలో అయిదవది అని తెలిపారు. 1860 లోనే రంప పితూరీలో అల్లూరి సీతారామరాజు కన్నా 40 సంవత్సరాల ముందే బ్రిటిష్ వారిపై ద్వారబంధాల చంద్రయ్యదొర పోరాడారని తెలిపారు. ద్వారబంధాల చంద్రయ్యదొర ప్రత్యేక తపాలా చంద్రిక సమర్పకులు, చంద్రయ్యదొర జీవిత చరిత్ర పుస్తక రచయిత కోటిపల్లి సుబ్బారావు మాట్లాడుతూ… చంద్రయ్య దొర పోరాటాలను, అప్పటి కాలం నాటి పరిస్థితులను వివరించారు. చంద్రయ్యదొర
పోరాటాలే రంప ప్రాంతంలో అప్పటి పరిస్థితులు మెరుగు పడడానికి నాంది పలికాయని, ఆయన జగ్గంపేటలో కలెక్టర్ సమావేశంపై చేసిన దాడి మరుపు రానిదని, అది బ్రిటిష్ వారికి దడ పుట్టించిందని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ… తపాలాశాఖ ఈ ప్రత్యేక తపాల చంద్రికల ముద్రణ ద్వారా అల్లూరి సీతారామరాజు,
ద్వారబంధాల చంద్రయ్యదొర లాంటి స్వాతంత్య్ర సమరయోధుల కీర్తిని తరువాతి తరాలకు తెలియ జేయడం చాలా అభినందనీయమని అన్నారు.
కనుమరుగు ఐపోతున్న ఈ దేశ భక్తుల చరిత్రను కాపాడుకునే ప్రయత్నం చేయడం మంచిది అన్నారు.
ఇటువంటి మరెన్నో ప్రత్యేక తపాల చంద్రికలను విడుదల చేయవలసిందిగా కోరారు. సుమారు 125 మంది స్వాతంత్ర సమర యోధులు ఈ రంప విప్లవంలో పాల్గొని జీవిత ఖైదు అనుభవించారని, వారిని ఈ విధంగా స్మరించు కోవడం మన కనీస ధర్మం అని తెలిపారు.

సభాధ్యక్షులు కాకినాడ డివిజనల్ సూపరింటెండెంట్ డి.యస్.యు.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉత్తరాల బట్వాడా, బ్యాంకింగ్, బీమా సర్వీసులతో ఇప్పుడు పోస్టల్ డిపార్టుమెంటు బ్యాంకులకు ధీటుగా అన్ని సదుపాయాలు అందిస్తుందని, పోస్టాఫీసులో ఫిలాటలీ అనే ఒక అందమైన, సృజనాత్మకమైన అభిరుచి తపాలా శాఖలో దాగి హవిహషయం చాలా మందికి తెలియదని, ఫిలాటలీ అనగా వివిధ సందర్భాలలో విడుదల అయిన స్టాంపులు, ప్రత్యేక కవర్లు, ద్వారా భావితరాలకు మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, జాతి గర్వించదగిన మహనీయులు గురించి తెలియ చెప్పే ఒక మహోన్నత ప్రక్రియని, ఈ రోజు ఈ తపాలా చంద్రిక విడుదల ద్వారా అల్లూరి, చంద్రయ్యదొర గొప్పతనం తరువాతి తరాలకు అజరామరంగా అందుతుందని తెలియజేసారు. పోస్ట్ మాస్టర్ జనరల్ డా. యం.వెంకటేశ్వర్లు ఎన్నో పోస్టల్ స్టాంపులు, ప్రత్యేక కవర్లను విడుదల చేసారని, ఆయన సలహాలు సూచనల మేరకు కాకినాడ పోస్టల్ డివిజనులో ఎన్నో ప్రత్యేక తపాలా కవర్లను విజయ వంతంగా విడుదల చేయగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విశాఖ జిల్లా తపాల శాఖ ప్రాంతీయ సహాయ ఆధికారి నాగఆదిత్య కుమార్, ప్రత్యేక తపాలా చంద్రికల సమర్పకులు, హైదరాబాదు మిత్ర సమూహ సంస్థల చైర్మన్ ఆర్.ఆర్.కే.రాజు, ప్రముఖ రచయిత కోటిపల్లి సుబ్బారావు, ద్వారబంధాల చంద్రయ్య దొర కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement