అమ్మవారికి పూజ కార్యక్రమం మరియు గరగ పూజ చేసి
గ్రామాసందర్శన చేయించడం జరిగింది.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండలం మావుళ్ళమ్మ సెంటర్ వద్ద శ్రీ శ్రీ మావుళ్ళమ్మ తల్లి కి నేడు పూజా కార్యక్రమం మరియు గరగ పూజ చేసి అమ్మవారిని గ్రామసందర్శన చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండలం పంచాయతీ సర్పంచ్ వెంకట సుధాకర్, ఆణివిళ్ళ మల్లికార్జున శర్మ దంపతులు చేతుల మీదుగా ఆ సాదు మందపల్లి మహేష్ కి గరగ అందించడం జరిగింది నేటి నుండి మే 2వ తేదీ వరకు మావుళ్ళమ్మ అమ్మవారికి గ్రామసందర్శన జరుగును మే 10వ తేదీన మావుళ్ళమ్మ అమ్మవారి తీర్థం ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయిబాబా, ఆలయ అర్చకులు ఫణి కాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు