Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“పాలకుల చేతగానితనం ప్రజల పాలిట శాపం”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
పాలకుల చేతగానితనం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. గత మూడేళ్ళుగా మండపేట – ద్వారపూడి రోడ్డు దుస్థితిపై నెత్తి నోరు బాదుకుంటున్నా సమస్యను చక్కదిద్దే నాయకుడు కనుచూపు మేర లో కనిపించడం లేదు. ఇంకా ఎన్నాళ్లీ వెతలో, ఎన్నెళ్లీ కష్టాల్లో తెలియదు గాని ఈ దిక్కుమాలిన రోడ్డు పై శుక్రవారం ఇద్దరు భార్యాభర్తలు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే మండపేట మండలం ద్వారాపూడి కి చెందిన వడ్డీ త్రిమూర్తులు తన భార్య పద్మను తీసుకుని ఓ పని పై మండపేట వస్తుండగా తాపేశ్వరం వచ్చేసరికి గోతులు అధికంగా ఉండటంతో మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో పద్మ తలకు తీవ్ర గాయమైంది. తల గాయానికి తోడు చెవి నుండి రక్తస్రావం కావడంతో పాటు వాంతులు కూడా అవ్వడంతో పరిస్థితి ప్రమాదకరం గానే కనిపిస్తుంది. స్థానికులు 108 కు సమాచారం అందించి రాజమహేంద్రవరం లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి క్షతగాత్రురాలు పద్మను తరలించారు. కాగా ఈ రోడ్డు దినదిన గండంగా మారుతుందని ప్రజలు ఎంతగా మొరపెట్టుకున్నా అదిగో ఇదిగో అంటూ అధికారులు,పాలకులు మాటల గారడి చేస్తున్నారు తప్పా సమస్యను పరిష్కరించే మార్గం అన్వేషించడం లేదు. ఈ రోడ్డులో నిత్యం ప్రయాణించే ప్రజలు ఇప్పటికే వెన్నెపూస సంబంధిత సమస్యలతో ఆసుపత్రి పాలు అవుతున్నారు. ఎవరూ గుర్తించని రోడ్డు ప్రమాదాలు రోజుకి ఎన్ని జరుగుతున్నాయో లెక్కే లేదు. అసలు తారే వేయకుండా తారు రోడ్లకు మరమ్మత్తులు చేసిన ఘన చరిత్ర మన ఆర్ అండ్ బీ అధికారులకు మాత్రమే దక్కుతుందేమో. ఈ రోడ్డు మరమ్మత్తులు పేరిట లక్షలాది రూపాయలు వెచ్చించినప్పటికి ఎక్కడా కూడా చుక్క తారు పోసిన పాపాన పోలేదు. దీంతో ఎక్కడికక్కడ దుమ్ము చెలరేగి ఈ రోడ్డు లో వెళ్ళాలంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇష్టానుసారంగా అధికారులు బండరాళ్లయితే వేశారు గాని ఎక్కడా తారు వేయకపోవడంతో మట్టి గాలికి ఎగిరిపోయి రాళ్లు పైకి లేచి ప్రజలకు ఇలా ప్రాణసంకటంగా మారుతోంది. ఆ మహిళకు ఇప్పుడు ఎలా వుందో తెలియదు గాని ఆమె కు ఏం జరిగినా ఇందుకు నైతిక బాధ్యత అధికారులు, పాలకులే వహించాల్సి ఉంటుంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement