-మహిళలు తరుపున ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు
తెలిపిన సర్పంచ్ నక్కా అరుణ కుమారి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ మండలం కామనగారువు పంచాయతీ కార్యాలయంలో వైస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమనికి కామనగురువుసర్పంచ్ అరుణకుమారి చంద్రశేఖర్ హాజరయ్యే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.ఆమె మాట్లాడుతూపేదలందరికీ ఇల్లు సంక్షేమ పథకాల లబ్ధి ని మహిళల పేరునే అందిస్తూ మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తుందన్నారు.అక్క చెలెమ్మల ముఖాల్లో చిరునవ్వులు, జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు కుటుంబ సారథులుగా ఇంటి దీపాలు గా పూర్తి బాధ్యత వహిస్తూ ప్రగతిపథంలో నడవాలని సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతోoదన్నారు. మహిళల ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక ప్రగతి వైపు పయనించేందుకు మహిళా సాధికారతకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడతాయని తదనుగుణంగా పేదరికాన్ని జయించి ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్నారు. నవరత్నాలు లో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ఎంత అద్భుతంగా కొనసాగుతోందని దీన్ని స్వయం సహాయక సంఘాల వారు సద్వినియోగం చేసుకుని పేదరికం నుండి బయట పడాలని ఆయన సూచించారు స్వయం సహాయక సంఘం అక్కచెల్లెళ్లు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టి నవరత్నాల్లో చేర్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు, మరియు డ్వాక్రా మహిళలు , సిబ్బంది తదితరులుపాల్గొన్నారు