-బిజెబి నాయకులు డిమాండ్.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కిర్లంపూడి:
కాకినాడ, విశ్వం వాయిస్ః
కిర్లంపూడి మండలం గొనేడ గ్రామం లో కూల్చివేసిన కమ్మరికుంట విషయమై భారతీయ జనతా పార్టీ ఒబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపిశ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు తోట వెంకట సర్వారాయుడు, ఒబిసి మోర్చా జిల్లా నాయకులు బాధితులతో కలసి జిల్లా కలెక్టర్ కి 1986 నాటి కమ్మరి కుంటల్ని ఇన్ని రోజులు జీవనాధారంగా ఉన్న కర్మగారాలను ధ్వంసం చేయడం పై అధికారుల పాత్రపై ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ చేసి బాధితులకు కర్మాగారం నిర్మించి వారి కమ్మరి వృత్తిని కొనసాగించే ఉత్తర్వులు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ప్రజా ఉద్యమానికి పిలుపుణిస్తామని తెలియజేసారు. ఈ సందర్భంగా తోట సర్వారాయుడు మాట్లాడుతూ గోనేడ సంఘటన విచారకరమని కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని చర్యలకు హామీ ఇచ్చారని అన్నారు. గోపిశ్రీనివాస్ మాట్లాడుతూ గోనేడ గ్రామంలో కమ్మరికుంట స్థలం పై భూ కబ్జాదారుల కన్ను పడిందిని మేము మండల పర్యటనలలో భాగంగా గ్రామంలో పర్యటించామని దీనికి స్థానిక తాహసిల్దార్ గ్రామ కార్యదర్శిల సహకారంతో కమ్మరికుంట సముదాయాన్ని కూల్చారని ప్రశ్నించిన బాధితులను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. గోనేడ గ్రామంలో రైతు పనిముట్లు నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు కలిగినవి అని గ్రామానికి గుర్తింపు తెచ్చిన వృత్తిని నిర్వీర్యం చేశారని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు పెద్దపీట వేస్తామని చెప్పి బిసి మంత్రులకు అధికారాలు లేకుండా చేసి పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కారకులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని బీసీల వృత్తులను నిర్వీర్యం చేయడం వారి భూములను కబ్జా చేయడం అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టడం బాధితులను భయపెట్టడం ఇదే పాలన అని వైసీపీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని మండిపడ్డారు. కానీ ఒబిసి మోర్చా ఈ రాష్ట్రంలో ఎక్కడ బిసి లకు అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడుతుందని, గోనేడ కమ్మరికుంట బాధితులు అన్యాయం జరిగిందని, కలెక్టర్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుపై తగిన న్యాయం అమలు కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి పిలుపిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేగి భద్రం , బిజెపి మండల అధ్యక్షులు యెడల రాంబాబు ,యువమోర్చా శ్రవణ్ కుమార్ , దళిత నాయకులు రవి, గోనేడ బాధితులు బ్రహ్మం ,నగేష్ , సత్యనారాయణ, శ్రీనివాస్ , తమ్మరావు, సుమారు వందమంది బాధితులు పాల్గొన్నారు.