– యధాతధంగా కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్పందన
– ఉదయం 10.30 నుంచి మ. 1.00 వరకు దరఖాస్తులు
స్వీకరిస్తాం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే దిశలో ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రకటన ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే ప్రతి నియోజకర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసే విధానం లో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ప్రజలు కోసం ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం యధాతధంగా నిర్వహించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నందు డిఆర్వో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆర్టీసి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు తెలియచేశారు. స్పందన ఫిర్యాదులు మీ మీ గ్రామ వార్డ్ సచివాలయంలో , మండల పరిధిలో తీసుకోవడం జరుతుందన్నారు.