విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని రాయవరం ఎస్ ఐ పీ వీ ఎస్ ఎస్ ఎన్ సురేష్ అన్నారు. రహదారి భద్రత దినోత్సవం కార్యక్రమంలో పురస్కరించుకుని కోనసీమ జిల్లా ఎస్పి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు మండపేట రూరల్ సీఐ పి శివ గణేష్ పర్యవేక్షణలో మండల కేంద్రమైన రాయవరం మెయిన్ రోడ్ వద్ద శనివారం ఎస్ ఐ సురేష్ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన మోటారు వాహనముల చట్టాలు,నిబంధనలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ
ట్రిపుల్ రైడింగ్, మొబైల్ రైడింగ్, ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, మైనర్ డ్రైవింగ్ చేయడం,శబ్దకారక పొగగొట్టాలు కలిగి ఉండడం నేరమని తల్లితండ్రులు కూడా ఈ విషయాలు గమనించి మైనర్స్ కు వెహికల్స్ ఇవ్వకూడదని తెలియజేసారు. మరియు.గుడ్ సమారిటన్ గురించి చెబుతూ ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని ఇందుకు ప్రభుత్వం రూ.5000 బహుమతిగా ఇస్తుందని తెలిపారు.
వాహన ప్రమాదాలు మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయని అందువలన ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమములో పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.