సోమేశ్వరం గ్రామం లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: ఈనెల 22వ తారీఖున ప్రచురించిన గుట్కా ఖైనీ జోరు, ఇతర మండలాల నుండి గుట్కా రవాణా తాత్కాలిక దాడులు నిర్వహిస్తున్న అధికారులు కథనానికి రాయవరం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీలలో మండలంలో
సోమేశ్వరం గ్రామంలో కిరాణా షాపులను హెడ్ కానిస్టేబుల్ మాధవరెడ్డి తన సిబ్బందితో తనిఖీ చేయగా పంపన కామరాజు గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న కామ రాజు పైశనివారం కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. అతడి కిరాణా షాపు నుంచి రూ.544 విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఈ కథనానికి స్పందించిన పోలీసులకు ప్రజలు అభినందనలు తెలిపారు.