కేజీ మటన్ ధర 500 కావడంతో గిరాకీ పెరిగిన మటన్
వ్యాపారం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండల పరిధిలోగల ఉప్పు కాలవ సెంటర్ వద్ద ముమ్మడివరం నివాసి అయిన ఇబ్రహీం గత కొంతకాలం నుంచి మటన్ వ్యాపారం చేస్తున్నాడు. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న రొట్టా శ్రీనివాస్ మటన్ వ్యాపారం చేస్తున్నాడు బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడని ఆక్రోశంతో శ్రీనివాస్ మటన్ రేటు 800 రూపాయలు ఉండగా 500 కే అమ్ముతాం అని బోర్డు పెట్టాడు. దాంతో ఇరువురి మధ్య ఘర్షణ పెరిగి పంచాయతీ వరకు వెళ్లడంతో పంచాయతీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ పంచాయతీ పరిధిలో ఎవరైనా వ్యాపారం చేసు కోవచ్చని పంచాయతీ కి పన్ను చెల్లించి అమ్మకం చేసుకోవచ్చని చెప్పడంతో ముమ్మిడివరం నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్న ఇబ్రహీం కేజీ ఐదు వందల రూపాయలకే మటన్ అమ్మడం తో మండలంలోని పరిసర ప్రాంతాల నుంచి మాంసం ప్రియులు ఆదివారం, మంగళవారం మటన్ కోసం ఎగబడటంతో మటన్ వ్యాపారానికి మంచి గిరాకీ పెరిగింది వ్యాపారం చేస్తున్న ఇబ్రహీం 7 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు ఇబ్రహీం త్వరలో మరొక సెంటర్ లో ఇదే ధరకు అమ్ముతూ ప్రజలకు స్వచ్ఛమైన ఆరోగ్యమైన మేకపోతు మాంసం అమ్ముతానని మరొక సెంటర్ లో మటన్ దుకాణం పెడతాం అని చెబుతున్నాడు