విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
సమాజ సేవకు తన వంతు సహకారం అందించిన ధన్యజీవులు యర్రంశెట్టి కొండలరావు దంపతులు అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధ్ బాబు తెలిపారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరంలో యర్రంశెట్టి కుటుంబ సభ్యులు నిర్వహించిన కొండల రావు దంపతుల ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం మండల్ పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు, ఎంపీడీవో కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.