పట్టించుకోని అధికారులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం
వన్నె చింతలపూడి జై భీమ్ నగర్ కి చెందిన మట్ట విజయకృప కి ఇద్దరు ఆడపిల్లల వన్నెచింతలాపూడి జై భీమ్ నగర్ జగనన్న లే అవుట్ లో ఆమె చిన్న గుడిసె వేసుకుని జీవనం కొనసాగేది .అయితే మీ మీ స్థలం ఎక్కడుందో మీకు చూపిస్తానంటూ నిర్దాక్షిణ్యంగా ఆమె గూడేసేను అధికారులు తీసివేశరని ఆమె తెలిపారు. జగనన్న లే అవుట్ లో ఆమెకు ఇల్లు స్థలం వచ్చింది .అధికారులు పట్టా కూడా ఇచ్చారు
కానీ ఇప్పటికీ వారి స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు
తమకి ఉండటానికి ఇల్లు లేకపోవడంతో ఇద్దరి ఆడపిల్లల తో అమలాపురం లో అద్దెకు ఉండే పరిస్థితి ఏర్పడింది.ఆ మహిళలకు అనారోగ్యం బాలేకపోయాన సరే అధికారులు దగ్గరకు వెళ్లి అనేక సార్లు తమ ఆవేదన మొరపెట్టుకున్న సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అసలు ఆమె స్థలం ఎక్కడుందో చూపించడానికి అధికారులు కు ఇబ్బందులు ఏంటి అని ప్రజల్లో చర్చనీయాంశం అయిందిఒక పక్క ఆరోగ్యం బోలేక,మరోపక్క ఇద్దరి ఆడపిల్లలు తో అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేక ఎవరికి చెప్పిన తమకు న్యాయం జరగకపోవడంతో విశ్వం వాయిస్ విలేకర్ ను విజయ కృప ఆశ్రయించింది అధికారులు ఇప్పటికి అయిన సరే తమ ఇళ్ల స్థలం చూపిస్తారో లేదో వేచిచూడాలి.ఒక వేళ ఇప్పటికి అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుటన్యాయం పోరాటం నిర్వహిస్తామని ఆమె తెలియజేశారు.అమలాపురం నియోజకవర్గంలో అనేక మంది ఇలాంటి బాధితులు ఉండటం విశేషం