Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అన్న ఆశయాలను నెరవేర్చడమే తమ్ముడు సంకల్పం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు: ఉచిత వైద్య శిబిరంలో అగ్రనేతలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్): ప్రజాసేవే ధ్యేయంగా పయనిస్తూ అశువులు బాసిన సంగీత సాయి గుణరంజన్ ఆశయాలను నడిపిస్తున్న ఆయన తమ్ముడు సుభాష్ సంకల్పం వెలకట్టలేనిదని పలువురు అగ్రనేతలు అభివర్ణించారు. ఆదివారం మండల కేంద్రం ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్ ప్రభుత్వ పాఠశాలలో పినపల్ల గ్రామానికి చెందిన దివంగత నేత సంగీత సాయి గుణరంజన్ 54వ జయంతి సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ నేతృత్వంలో రాజమహేంద్రవరం స్వామి వైద్యాలయ న్యూరో అండ్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత సాయి గుణరంజన్ ను గుర్తుచేసుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మధ్యలోనే ఆగిపోయిన అయన ఆశయాలను మరణం అనంతరం పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా గుర్తు చేస్తున్నందుకు ఈ సందర్భంగా సుభాష్ ను అభినందించారు. రాజమహేంద్రవరంకు చెందిన స్వామి వైద్యాలయ న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పరిమి నాగసత్య ప్రసాద్ (ఎండి డిఎం న్యూరో ఫిజియసిన్), డాక్టర్ పవన్ కిషోర్ పోతుల యంఎస్ (గైన్ సర్జరీ), స్త్రీల వ్యాధులకు సంబంధించి డాక్టర్ ఆరతి చీకట్ల ఎంబిబియస్, ఎముకులు విభాగమునకు సంబంధించి డాక్టర్ యేల్నేడి గంగాధర్ (ఆర్థోపెడిక్), డాక్టర్ శ్రీ హరి రాయలు వెన్న (గైన్ మేడిక్లిన్) డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలుతో పాటు, బిపి, షుగర్, సాధారణ వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, మెదడు, గుండె, ఎముకలు పరీక్షలు నిర్వహించి చి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ఆలమూరు మండలంతో పాటు కపిలేశ్వరపురం మండలం నుండి అధిక సంఖ్యలో రోగులు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement