WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

“”ప్రజలు సమస్యలు పరిస్కారం కోసమే స్పందన కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"""జిల్లా కలెక్టర్ హిమాన్షు"""

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్)
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి స్పందన కార్యక్రమానికి విచ్చేస్తున్న అర్జీదారుల సమస్యల పట్ల సత్వరమే స్పందించి సంతృప్తి స్థాయిలో పరిష్కార మార్గాలు చూపుతూ స్పందన పనితీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కోనసీమ జిల్లాకలెక్టరేట్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించి సమారు 180 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సంబంధిత సిబ్బంది పూర్తిగా విచారించి నిబంధనలకు లోబడి తగు పరిష్కారమార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని ఆదేశించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అర్జీల పరిష్కార సరళిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహరానికి చెందిన ఎ. సుధీర్ కుమార్ పుట్టుకతోనే చర్మ వ్యాధుల బారిన పడ్డారని వీరికి ఎటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం అందట్లేదని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరట్లేదని, అదే విధంగా అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన వై.మణికంఠకు కాళ్ల కండరాలు బలహీన పడి దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నానని జిల్లా కలెక్టర్ వారిని ఆశ్రయించగా వీరి ఇరువురుకి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉచితంగా చికిత్సలు అందించడమే కాకుండా సదరన్ ధ్రువ పత్రాల ఆధారంగా అర్హతను బట్టి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. వేసవి వడగాల్పులు ఎక్కువగా ఉన్నందున చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రజలలో అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. భూ సంబంధిత ఫిర్యాదులు, సంక్షేమ ఫలాలు లబ్ధి చేకూర లేదంటూ ఎక్కువ స్థాయిలో అర్జీలు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల నిర్వహించనున్న క్షేత్రాలలో మంచినీరు, మజ్జిగ, నీడ కొరకు టెంట్లు ఏర్పాట్లు, నిబంధనలకు అనుగుణంగా చేపట్టి ఉపాధి కూలీలకు బాసటగా నిలవాలన్నారు. పంట కాలువలు త్వరలో మూసి వేసే అవకాశం ఉందని, ఉపాధి క్షేత్రాలలో పూర్తిస్థాయిలో పనులు కల్పన ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు. వేసవిలో ఉపాధి హామీ సెల్ఫ్ లలో పూర్తిగా పనులు ప్రారంభించి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు ఖరీఫ్ సీజన్ కు కాలువలను పరిశుభ్రపర్చి సిద్ధం చేయాలని సూచించారు. వేసవికాలంలో ఉపాధి హామీ పనులు పూర్తయ్యేలా సంబంధిత అధికారులు పూర్తి సమన్వయం వహించాలన్నారు. ఒకసారి అందిన అర్జీ మరల స్పందన కార్యక్రమానికి సమర్పితం కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర జిల్లా రెవెన్యూ అధికారి. సత్తిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జె.డి జి సంకురియ్య, డీఎస్ఓ కె వి ఎస్ ఎo. ప్రసాద్, డి సి హెచ్ ఎన్ ఎంపీ పద్మశ్రీ రాణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కృష్ణారెడ్డి , జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారిని సత్యవాణి, ఎస్.వి.ఆర్ చంటి బాబు, డి ఎల్ డి ఓ డి ఆర్ డి ఏ పి డి జిలాని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బివి రమణ, వ్యవసాయ శాఖ జెడి ఆనంద కుమారి, డి ఎమ్ హెచ్ ఓ భరత్ లక్ష్మి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి లక్ష్మీనారాయణ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ తరుణి ,హౌసింగ్ పిడి టీ రాజేంద్ర ఎస్ .ఈ.పి ఆర్ .చంటి బాబు, జిల్లా చీఫ్ కోచ్ పి ఎస్ సురేష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement