Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

ఆశయాలు నెరవేరాలి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఘనంగా పొలిశెట్టి భూషణం 11వ వర్ధంతి…
పేదలకు వస్త్రాలు పంపిణీ…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:- పేదరికం కు విద్యాలేమి కారణమని అందుకే విద్య వ్యాప్తి కి నిరంతరం కృషి చేయాలని తన తల్లిదండ్రులు దివంగత పొలిశెట్టి సత్తిరాజు, భూషణం లు అనునిత్యం తనకు గుర్తు చేసేవారని వారి ఆశయాల సాధన కు కృషి చేస్తామని తాపేశ్వరం సురుచి  ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు పేర్కొన్నారు. ఆయన మాతృ మూర్తి దివంగత పొలిశెట్టి భూషణం 11 వ వర్ధంతి సోమవారం తాపేశ్వరం సురుచి వద్ద నిర్వహించారు. ప్రతి ఏటా గ్రామంలో వందలాది మహిళలకు చీరలు పంపిణీ  చేస్తున్నారు. మల్లిబాబు కుటుంబ సభ్యులు  మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు ఆశలు, ఆశయాలను నెరవేరుస్తున్న తమ ఏకైక సోదరుడు మల్లిబాబు క్రమశిక్షణ కు మారు పేరు గా నిలుస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ తండ్రి సృష్టించిన కాజా కు గుర్తింపు తెచ్చి తండ్రి సత్తిరాజు ఆశయాన్ని సజీవంగా ఉంచుతున్నారన్నారు.అలాగే వందలాది మంది కి ఉపాధి,విద్య అవకాశాలు కల్పిస్తూ తల్లి భూషణం ఆశయాన్ని కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు.తమ సోదరుడు మల్లిబాబు అని  చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ సమాజం లో అణగారిన వర్గాల వారికి సేవ చేయాలని తన తలిదండ్రులు చెప్పే వారన్నారు.అందుకు అనుగుణంగా తన పరిధిలో సాధ్యమైన సాయం  చేస్తున్నానని చెప్పారు. తొలుత పొలిశెట్టి భూషణం  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, మల్లిబాబు సతీమణి తో బాటు కుమార్తె మనస్విని, సురుచి పీఆర్ ఓ ఉప్పలపాటి రామ్ బద్రీ రాజు,మేనేజర్ శంకర్, కుక్స్ బప్పీ, మల్లి, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!