విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
భారతీయ జనతా పార్టీ అమలాపురం మున్సిపాలిటీ 2వ వార్డు మరియు 4 వార్డులలో ఎస్సీ మోర్చా కోస్టల్ జోనల్ ఇంచార్జ్ దూరి రాజేష్ అధ్యక్షతన జరిగిన గృహ సంస్కారం కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి నాయకులు, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ యాళ్ల. దొరబాబు, సీనియర్ నాయకులు ఆర్. వి. నాయుడు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్రీ చిట్టి బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి ఆధ్వర్యంలో 2 మరియు 4 వార్డులలో పలు కుటుంబాలను పలకరించి గృహ సంస్కారం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అరిగెల వెంకటరామారావు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవాదుల సూర్యనారాయణమూర్తి, మహిళా మోర్చ జోనల్ ఇంచార్జి చిట్టూరి రాజేశ్వరి, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్, అమలాపురం టౌన్ ప్రధాన కార్యదర్శి అరిగెల తేజ వెంకటేష్, అమలాపురం టౌన్ ప్రధాన కార్యదర్శి బచ్చు ప్రభాకర్ తదితరులు ఈ సంస్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు.