-ఉపాధ్యాయులపై.. కక్షసాధింపు తగదు!!
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
కాంట్రిబ్యూటరీ ఫెన్షన్ స్కీమ్ ను రద్దుచేసి పాత ఫెన్షన్ విధానం కోరుతున్న ఉపాధ్యాయుల పోరుగర్జన ర్యాలీని నిర్భందించడం అనైతికంగా వుందని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. కమిటీల పేరిట జాప్యం చేస్తూ మూడేళ్లుగా సిపిఎస్ రద్దు హామీనిఅమలు చేయకపోవడంతో సందేహాలు పెరుగుతున్న దుస్తితి వుందని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వానికి ప్రగతి సాధ్యమన్నారు. ఏడాది పొడవునా రేయింబ వళ్ళు పాఠ్యాంశాలు అభ్యసించే విద్యార్థుల తో బాటుగా బోధించే ఉపాధ్యాయులకూ వేసవి సెలవులు వుండాలని ఇందుకు భిన్నంగా సెలవులు రద్దు చేసి కక్ష సాధింపు చేయడం అనుచితమ న్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరారు.