విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ : ఈ ప్రభుత్వం పెద్దల ప్రభుత్వం కాదు పేదల ప్రభుత్వం అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సోమవారం రాయవరం మండలం మాచవరం గ్రామంలో తోట త్రిమూర్తులు లకు అభినందన సభ సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వైయస్సార్సీపి మండపేట నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ప్రజలకు ఉపయోగకరమైన మంచి పనులు చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పదవుల ఎవరికీ శాశ్వతం కాదని మనం చేసినటువంటి మంచి పనులు, అభివృద్ధి పనులే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్సీ తోట అన్నారు. ప్రజలకు మంచి పనులు చేసేటప్పుడే నాకు సంతృప్తి కలిగిస్తుందని అన్నారు. నేను మొట్టమొదటిసారిగా మాచవరం గ్రామంలో వచ్చేటప్పుడు దేవుడి కాలనీ కి నన్ను గ్రామ పెద్దలు తీసుకురావడం జరిగిందని ఇదే అమ్మవారి దేవాలయం సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ ప్రజల గత 18 సంవత్సరాల నుండి దేవుడు కాలనీ కి కాలవ గట్టు వద్ద కాలి బాట వంతెన లేక మాచవరం గ్రామంలో కి వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు పడుతున్న బాధలను ఎమ్మెల్సీ కి వివరించారు. దీనిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించి సమీక్షించి ప్రజలు కాలిబాట వంతెన వస్తే చాలు అని అన్నారు కానీ వారికి ఆటో వెళ్లే విధంగా వంతెన ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. 18 సంవత్సరాల నుండి పడుతున్న వేదనను 15 రోజుల్లోనే సమస్య పరిష్కారం మా ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్సీ తెలియజేశారు. తొలుతగా ఆయన సుమారు 10 లక్షల రూపాయలతో నిర్మించిన వంతెన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏ మంచిపని చేశారని ఆయన ఆయన అన్నారు. అనంతరం దేవుడు కాలనీ మహిళలు ఎమ్మెల్సీ తోటను దుశ్శాలువతో సాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలోఎంపీపీ వెంకటరమణ, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, వైసిపి నాయకులు సత్తి వెంకట రెడ్డి, కొవ్వూరు శ్రీనాధ రెడ్డి, ఉప సర్పంచ్ వసంత్ కుమార్ రెడ్డి, సబ్బెళ్ళ కాశీ ఈశ్వర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.