Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనికీలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఐ. పోలవరం , ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎస్ ఎస్ వి సుబ్బారెడ్డి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

ఐ.పోలవరం-విశ్వం వాయిస్ న్యూస్:

అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని ఐ. పోలవరం, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లను జిల్లా ఎస్పీ కేఎస్ఎస్ వి సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పరిసరాలను ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి స్టేషన్ రికార్డులు, లాకప్, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేసారు. స్థానికంగా ఉన్న ప్రాముఖ్యత గల అంశాలను ఎస్ఐ, సిఐ లను అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.

ఐ. పోలవరం పోలీస్ స్టేషన్ రాష్ట్ర సరిహద్దు గల పోలీస్ స్టేషన్ గా ఉన్నందున మద్యం, నాటుసారా రవాణా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని, ముమ్మిడివరం ఇన్స్పెక్టర్ ఐ. పోలవరం ఎస్సై కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దిశా యాప్ గురించి ప్రజలలో అవగాహన కల్పించి సదరు యాప్ డౌన్లోడింగ్, రిజిస్ట్రేషన్ ల సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించారు. అనంతరం యానం-ఎదుర్లంక వంతెనను సందర్శించి నేషనల్ హైవే పై ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన తగు సూచనలు చేసారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!