విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:- జిల్లా లో అసంపూర్తిగా ఉన్న సచివాలయం భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ పేర్కొన్నారు. మండపేట మండలం లోని ఆర్తమురు, ఏడిద లలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలం లో అసంపూర్తిగా, నిర్మాణం చేపట్టని సచివాలయ భవనాలు, వైఎస్సార్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు,డిజిటల్ లైబ్రెరీలను పరిశీలించారు. భూవివాదం, స్థల సమస్యలు ఉంటే పరిష్కారిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లు అందుబాటులో ఉన్నారోలేదో అడిగి తెలుసుకున్నారు.బిల్లులు వస్తున్నాయా లేదా అనే అంశాలు ఎంపీడీఓ ఐదం రాజు ను అడిగారు. జగనన్న కాలనీ నిర్మాణాల పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ భాగ్యరాజు, పి ఆర్ ఏ ఈ నాగేశ్వరరావు, హౌసింగ్ ఏ ఈ గణేశ్వర రావు, తహశీల్దార్ తంగేళ్ల రాజేశ్వరరావు, ఆర్ ఐ లు కంఠంశెట్టి గౌరీ దేవి, మెడిశెట్టి హరి, సర్పంచ్ లు బురిగ ఆశీర్వాదం, గోలుగురి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.