Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కృతికా శుక్లా"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ సిటీ న్యూస్: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు సాఫీగా జరుగుతున్నయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
బుధవారం ఉదయం స్థానిక సాలిపేట నగరపాలక బాలికోన్నత పాఠశాలలో రెండు కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగుతాయని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలలో మొత్తం 66,680 మంది విద్యార్థులు 358 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుంచి మధ్యాహ్నం 12.45గం.ల వరకు పరీక్ష సమయమని పేర్కొన్నారు. అనంతరం గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి, పిల్లల హాజరు వివరాలను కలెక్టర్ కృతికా శుక్లా అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ పరీక్షల సంయుక్త సంచాలకులు వి.రాజశేఖర్, అర్బన్ తహసీల్దార్ వైహెచ్ సతీష్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement