విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ విద్యాసాగర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాయవరం రామయ్య జిల్లా పరిషత్ పాఠశాల, స్థానిక భాష్యం ప్రైవేట్ పాఠశాల ల పసలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టెన్త్ క్లాస్ పరీక్షలు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌన్సిల్ జిల్లాలో టెన్త్ పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టామన్నారు. తనిఖీ చేసిన పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి కాపీ లు తావు లేకుండా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
రెండవ రోజు పరీక్షకు విషయాన్ని విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష కేంద్రాలకు వచ్చారు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలకు వస్తున్న విద్యార్థినీ విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ జరగకుండా విద్యార్థులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పరీక్ష కేంద్ర చీఫ్ సూపర్నెంట్ లు, ఉపాధ్యాయులు ఉన్నారు.