Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వం నీటిదేశించిన పనులలో పురోగతిని సాధించే దిశగా చర్యలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లా
కలెక్టర్ డా.కే. మాధవీలత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

సమగ్ర గ్రామీణప్రాంతాల అభివృద్ధి దిశలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా ద్వారా చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చెయ్యాలని జిల్లా
కలెక్టర్ డా. కె.మాధవిలత పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన పనులలో పురోగతిని సాధించే దిశలో , ఆయా శాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లుకు దిశా నిర్దేశం చేశారు.
గురువారం వెలగపూడి సచివాలయం నుంచి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోనశశిధర్ వర్చువల్ విధానం ద్వారా జిల్లా కలెక్టర్లు తో శాఖా పరంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్, పీఎంజిఎస్ వై, జలజీవన్ మిషన్, మహాత్మా గాంధి గ్రామీణ ఉపాది హామీ పథకం, వైఎస్ఆర్ జలకళ ప్రగతి లక్ష్యాలు పై సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నే పౌర సేవలు అందించే క్రమంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామ సచివాలయాలు, ఆర్బీకె భవన నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, జలకళ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల(swpc ) కేంద్రాల వంటి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల్లో ప్రగతిని సాధించే విధంగా మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాధవిలత అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా ద్వారా చేపట్టిన పనుల ను వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా ఏ పిడి జి.శ్రీనివాస్, ఎస్ఈ పిఆర్ ఏ బి వి ప్రసాద్, ఈఈ ఆర్డబ్ల్యూ ఎస్ డి.బాల శంకర్రావు రాజమహేంద్రవరం,కొవ్వూరు డి ఎల్ పిఓలు నారాయణ, భమిడిపాటిమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement