ఘనంగా వర్థంతి….
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
కాలే కడుపు తో ఏ ఒక్కరు ఉండకూడదని ఒకే లక్ష్యం తో అన్నపూర్ణ అవతారం ఎత్తి జీవితాంతం నిత్యాన్నదానం తో చిరస్థాయిగా నిలిచిన దివంగత డొక్కా సీతమ్మ పుట్టిన నేల మండపేట ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. మండపేట విజయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాతడొక్కా సీతమ్మ వర్ధంతిగురువారం ఘనంగా నిర్వహించారు.అన్నం పరబ్రహ్మ స్వరూపం గా భావించి ఆమె చేసిన సేవలను గుర్తు చేస్తూ మండపేట బురుగుంట పార్కు లోని డొక్కా సీతమ్మ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథి గా మండపేట సిటీ మునిసిపల్ కమిషనర్
త్రిపర్ణ రామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలిగా ఉన్న వారిని ఆదరించి వారికి కడుపు నిండా అన్నం పెట్టే సీతమ్మ సేవలను కొనియాడారు. అన్నదాతలకు మండపేట లో కొదవ ఉండదని పేర్కొన్నారు.
తొలుతబురుగుంట చెరువు పార్కు వద్ద సీతమ్మ విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
50 మంది అన్నార్తులకు అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు.
పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చలివేంద్రంలో బాటసారులకుమజ్జిక వితరణ చేశారు.మండపేటలోని వివిధ ప్రాంతాలలో ఉన్న అన్నార్తులకు డొక్కా సీతమ్మ సంచార అన్నదాన శిబిరం ద్వారా 200 ల మందికి అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
మండపేట పట్టణంలోని
7 వ వార్డు లోని ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ సంస్థ,
బస్ స్టాండ్ వెనుక వీధిలో ఉన్న డొక్కా సీతమ్మ నిరతాన్న దానశిబిరం , అంధుల పాఠశాల ఈ మూడు సంస్థలలోను అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ట్రస్ట్ సభ్యులు సి హెచ్ పణికుమార్, జక్కా రవి తేజ,
శేషారావు, బి హరికృష్ణ, బి జయకృష్ణ,ఏ రవితేజ, వి మణిదీప్, ఎస్ జ్యోతి కుమార్, బాలసుబ్రహ్మణ్యం,
గంగదర్ రెడ్డి, కె కాళీకృష్ణ, ఆర్ ఆశిష్, బి విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు.