విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
హిందూ ముస్లింల ఐక్యత కు రంజాన్ మాసం లోని ఇఫ్తార్ విందులు ప్రతీకలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట సర్దార్ శ్రీ వేగుళ్ల వీర్రాజు సెంటర్ లోని హనఫీ ఆహాలే సున్నత్ వల్ జమియా మస్జీద్(పెద్ద మసీదు) లో జరిగిన ముస్లింల ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మసీదు ఇమామ్ గులాం ముహమ్మద్ మూర్షిద్ రజ్వి మాట్లాడుతూ ఇఫ్తార్ విందు లో ఒకరినొకరు గౌరవించుకోవడం సత్ సంప్రదాయంగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాదా ప్రసాదరావు, మసీదు అధ్యక్షులు ఎండి అతవుర్ రెహమాన్, ఎం కరీం ఖాదరి, ఏ పి యు డబ్ల్యు జె ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, మాజీ అధ్యక్షులు Md గయసుద్దీన్ లు పాల్గొన్నారు.