విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:
మండపేట మున్సిపల్ కౌన్సిలర్ నీలం దుర్గ కుమారుడు నీలం భాస్కర్ అకాల మృతి చెందడంతో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. యుక్త వయసులోనే ఇలా జరగడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మున్సిపల్ కౌన్సిలర్లు యారమాటి గంగరాజు, గుండు రామ తులసి, కాశిన కాశీ విశ్వనాదం, చుండ్రు చిన సుబ్బారావు చౌదరి, కాళ్లకూరి స్వరాజ్య భవాని, టిడిపి నాయకులు లంకలపల్లి రాంబాబు, రాంబిల్లి పాపారావు,గుండు తాత రాజు, కాళ్లకూరి శ్రీను తదితరులు వున్నారు.