Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పేదవాడు సొంతాఇంటి కలను నిజం చేసే దిశగా అడుగులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ప్రతి 1000 లేఆవుట్లకి వక యనిమిటి కార్యదర్శి నియామకం
– వెలుగుబండ లేఅవుట్ ను పీశ్రీసిలించిన
ఎమ్. క్షమాలకర్ బాబు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని మరింత వేగవతం చెయ్యడం జరుగుతోందని ఉభయ గోదావరి జిల్లాల హౌసింగ్ ప్రత్యేక అధికారి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎం . కమలాకర్ బాబు పేర్కొన్నారు. గురువారం రాజానగరం మండలం వెలుగుబంద గ్రామ పరిధిలోని హౌసింగ్ లే అవుట్ల ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్. కమలాకర్ బాబు మాట్లాడుతూ స్థానిక పరిధిలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా వెలుగుబంద లే అవుట్ లో తొలిదశలో 6,156 మంది లబ్ధదారులకు ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఆయా ఇంటి నిర్మాణాలను మరింత వేగవంతం చేసే దిశలో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇనుము, సిమెంట్ తదితర ముడి సరుకును లే అవుట్ వద్ద అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 830 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. లబ్ధిదారులకు భరోసా కల్పించే ఉద్దేశంతో, ప్రతి 1000 లే అవుట్ లకి ఒక యమీనిటీ కార్యదర్శి చొప్పున ఆరుగురిని నియమించడం జరిగిందన్నారు. పనులను మరింత వేగం పెంచే దిశలో అదనపు భాద్యతలను కేటాయించిన వార్డు యమీనిటీ కార్యదర్శి కి వెల్ఫేర్ కార్యదర్శి సహాయకునిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చామన్నారు. వీరికి సంబంధించి బయో మెట్రిక్ అటెండెన్స్ క్షేత్ర స్థాయిలో తీసుకునే చర్యలు చేపట్టామని కమలాకర్ బాబు పేర్కొన్నారు. ముడి సరుకులు అందుబాటులో ఉంచడమే కాకుండా ఆర్థికంగా తోడ్పటు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో హౌసింగ్ పిడి బి. తారాచంద్, అడిషనల్ కమిషనర్ సత్యవేణి, హౌసింగ్ ఈ ఈ జీ.సోములు, డీ ఈ కే ఎస్ ఎన్ రెడ్డి, ఏ ఈ లు కే. ఉమాశంకర్, డి ఎస్. చాంబర్లిన్, వర్క్ ఇన్స్పెక్టర్ లు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement