-ప్రజల్లో కూడా సామాజిక బాధ్యత ఉండాలి .. కె.. దినేష్
కుమార్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్షమించనని నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు.గురువారం స్థానిక ఇన్నీస్ పేట 26, 27 వార్డుల్లోఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దినేష్కుమార్ మాట్లాడుతూ విధులకు గైర్హాజరై.. నిర్లక్ష్యం గా వ్యవహరించినా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కు నుంచి వివరణ కోరడం జరిగిందన్నారు. సమిష్టి బాధ్యతగా నగర పరిశుభ్రత పట్ల తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా పని పట్ల నిబద్ధత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మస్టర్వివరాలుతెలుసుకుని హాజరు పట్టీని పరిశీలించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ఉదయాన్నే ప్రారంభించడం మంచి ఫలితాలు ఇస్తోందని, విధుల్లో మరింత అంకితభావం ఉండాలని సూచించారు. కాలువల్లో సిల్ట్ ను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. చెత్త సేకరణ విషయం లో ప్రతి ఇంటి నుండీ తప్పనిసరిగా జరుగుతోందో లేదో పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. విధుల పట్ల సూపర్ వైజర్లు, సేకరణ సిబ్బంది నిబద్దత ఉండాలని పేర్కొన్నారు. సకాలంలో చెత్త సేకరణ చేపట్టక పోతే కొందరు గృహ యజమానులు రోడ్ పైనో, కాలువల్లోనో చెత్త వేసే అవకాశం ఉంటుందన్నారు. తన సందర్శన సమయం లో ఎక్కడైనా రోడ్ పక్కన గానీ, మురుగు కాలువ లో గానీ చెత్త పోగై కనిపిస్తే సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. పౌరులు కూడా తమవంతు సామాజిక బాధ్యతగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి సహకరించాలని తెలిపారు. ఈ పర్యటనలో ఎమ్ హెచ్ ఓ వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ లు శ్రీనివాస్, రామలింగారెడ్డి కమిషనర్ వెంట ఉన్నారు.