అధికారులు, నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్): ఆలమూరు మండలంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆలమూరు వ్యవసాయ శాఖ అధికారిణి (ఏవో) సోమిరెడ్డి లక్ష్మి లావణ్య తెలిపారు. మండల పరిధి చొప్పెల్ల రైతు భరోసా కేంద్రం వద్ద శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఆలమూరు మండలంలో మొత్తం 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకూ మండలంలో 10525 ఎకరాలకు గాను 1,600 ఎకరాలలో వరి కోత పూర్తయిందని అన్నారు. సుమారుగా 5500 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని, పంట నమోదు చేయుంచుకున్న రైతులు ధాన్యం అమ్ముకునేందుకు స్థానిక రైతు భరోసా కేంద్రాల సహాయకులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, మండల వైసీపీ కన్వీనర్, చెముడులంక గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసు, తోరాటి రాంబాబు, దంగేటి బాపనయ్య, గుర్రపు శ్యామసుందర్, పాలూరి రాధాకృష్ణ, వి హెచ్ ఏలు పాల్గొన్నారు.