Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమం… డాక్టర్ ప్రశాంతి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

# పరిశోధనలు రైతులకు చేరువ కావాలి
# పలు అంశాలపై విస్తృత చర్చ
# రైతు వారి పుస్తకావిష్కరణలు
# డ్రోన్ పనితీరుపై ప్రత్యేమెగా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి )
వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలు రైతులకు చేరువ అయి లాభసాటిగా ఊనప్పుడే లక్ష్యం పూర్తవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆశయం రైతుల సంక్షేమం అనీ డాక్టర్ ప్రశాంతి అన్నారు.రెండు రోజుల గోదావరి మండల పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశాలు శనివారం నెగ్గిపూడి గ్రామంలో గల మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముగిసినవి.ఈ సమావేశాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్. ప్రశాంతి అధ్యక్షత వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి. రాంబాబు పాల్గొని విస్తరణ విభాగానికి దిశానిర్దేశం చేసినారు. మొదటిరోజు, వివిధ పంటల యాజమాన్య పద్ధతులను ఆయా పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన శాస్త్రవేత్తలు వివరించారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాల్లో వ్యవసాయ స్థితిగతులను వివరిస్తూ, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రతి జిల్లా నుండి వచ్చిన అభ్యుదయ రైతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు మరియు వారికి కావలసిన పరిశోధన మరియు విస్తరణ అవసరాలను తెలియజేసినారు. ఈ సందర్భంగా డా. మానుకొండ శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త సంకలనం చేసిన “వరి సాగులో నేరుగా వెదజల్లే పద్దతి” పైన, డా. వై. సునీత, సీనియర్ శాస్త్రవేత్త సంకలనం చేసిన “మారుటేరు నుండి విడుదలైన వరి రకాలు” మొదటి రోజు సమావేశంలో విడుదల చేశారు. రెండో రోజు సమావేశంలో, గోదావరి మండలంలో ఉన్న ఏరువాక కేంద్రాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వారి వారి క్షేత్ర సందర్శనలో గమనించిన చీడపీడలను, పరిశోధన-విస్తరణలో చేపట్టవలసిన అంశాలను, రైతు పొలంలో చిరు సంచుల ప్రదర్శన ఫలితాలను వివరించినారు.చిరు సంచి దశలో ఉన్న MTU-1318, స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పండించడం వల్ల, అది పడిపోకుండా అధిక దిగుబడులను ఇస్తుందని రైతులు తెలిపారు.ఇటీవల కాలంలో పెరుగుతున్న ఎలుకలు,కోతుల సమస్యపై ఆ విభాగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీనివాసరావు ద్వారా ప్రజెంటేషన్ ఇప్పించారు. తదుపరి సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను,అభ్యుదయ రైతులను కలిపి సమూహాలుగా విభజించి, వివిధ సమస్యలను చర్చించారు.దీనిలో గల పరిశోధన మరియు విస్తరణ అంతరాలను గుర్తించి, తదనుగుణంగా రైతుల అవసరాలు తీర్చే విధంగా కార్యాచరణ రూపొందించారు. వరి పంటలో కొత్త రకాలు, పురాతన రకాల పోషక విలువలు, సమీకృత వ్యవసాయం, వరి దుబ్బులను కాల్చకుండా విచ్ఛేదన చేసి కుళ్లిపోయే విధంగా పరిశోధనలు,తడిసిన రంగుమారిన ధాన్యం విలువ జోడించే విధానాలు,వరిలో కాండం కుళ్ళు తెగులు నియంత్రణ, వరిలో ఎలుకల నివారణ ఎర తెర పద్ధతి వంటి వాటిపై పరిశోధనలు విస్తరణ చేపట్టాలని ప్రధాన శాస్త్రవేత్త (వరి) డాక్టర్ టి. శ్రీనివాస్ తెలియపరిచారు. చిరుధాన్యాల మిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కావున రాగి పంటలు విరివిగా పండించి రైతులు లబ్ధి పొందే విధంగా కార్యాచరణ చేపట్టాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ తెలియజేసినారు. సేంద్రియ చెరుకు రసం తయారీ విధానంపై రైతు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరి మరియు ఇతర పంటల్లో పెరుగుతున్న డ్రోన్ ల వినియోగం దృష్ట్యా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు మరింత చేరువ చేయడానికి విశ్వవిద్యాలయం పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించినట్లు పరిశోధన సంచాలకులు డాక్టర్ ప్రశాంతి తెలియజేసినారు. డ్రోన్ పనిచేసే తీరును పొలంలో ప్రదర్శించి చూపించారు. కార్యక్రమంలో డి.ఏ.ఓ లు ఎన్.విజయకుమార్,వై.ఆనందకుమారి, ఎస్ మాధవ్ రావు,వై.రామకృష్ణ,.జెడ్.వెంకటేశ్వర్లు,ఏఆర్ఎస్ పెద్దాపురం డాక్టర్ మునిరత్నం, డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, డా. దక్షిణా మూర్తి, కెవికె డా మల్లిఖార్జునరావు, విజయ,తదితర శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొనగా, ఈ సమావేశంలో ఈ సంవత్సరములో పదవీ విరమణ చేయబోతున్న డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఏఎన్జిఆర్ఏయు,గుంటూరు డాక్టర్ పి. రాంబాబు,విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ లను,పరిశోధన సంచాలకులు డాక్టర్ ప్రశాంతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ జోగి నాయుడు డీఎవోలు,శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఘనంగా సత్కరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement