వివిధ ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్న ఆర్డీవో
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): సంక్షేమ పాలనను ప్రజలకు మరింత దగ్గరచేసి అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థకు సంబంధించి నిర్మిస్తున్న నూతన భవనాల నిర్మాణం త్వరిగతిన పూర్తి చేయాలని రామచంద్రపురం ఆర్డీవో పి. సింధుసుబ్రహ్మణ్యం అన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని 18 గ్రామాల్లో జరుగుతున్న నూతన భవన నిర్మాణాలను ఆలమూరు ఎంపీడీవో జేఏ ఝాన్సీ, తాసిల్దార్ లక్ష్మీపతి, ఎంపీపీ తోరాట లక్ష్మణరావుతో కలిసి పరిశీలించారు. మొత్తం ఆలమూరు మండలంలో 24 సచివాలయాలకు గాను ఆలమూరు సచివాలయం పూర్తి అవ్వగా మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని, అలాగే 24 రైతు భరోసా కేంద్రాలకు గాను 18 నిర్మాణాల్లో ఉన్నాయని, 20 హెల్త్ సబ్ సెంటర్లుకు గాను పద్నాలుగు భవనాలు నిర్మాణంలో ఉన్నాయని వాటినన్నిటిని ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థితిగతులను నమోదు చేసుకున్నారు. పరిశీలించిన నివేదికను జిల్లా కలెక్టర్ వారికి అందజేయనున్నట్లు ఆర్డిఓ తెలిపారు. ఆర్డీవో వెంట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పోసమ్మ, పంచాయతీ రాజ్ ఏఈ డి వీరభద్ర రావు, వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్, సర్పంచులు గుణ్ణం రాంబాబు, తమ్మన శ్రీనివాసు, దంగేటి చంద్రకళ బాపనయ్య, కందిభట్ల శ్రీను, పెంటపాటి శ్యామల, యూ లక్ష్మీ మౌనికతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు తొిరాటి రాంబాబు, దియ్యన పెద్దకాపు, పలువురు సర్పంచులు, పలు శాఖల అధికారులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.