విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డివిజన్, మండల స్థాయి అధికారులకు గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు సోమవారం ఘనంగా సత్కరించారు.గుమ్మిలేరు గ్రామంలో నిర్ణీత సమయంలో గ్రామ సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రం, హెల్త్ అండ్ వెల్త్ నెస్ సెంటర్ నిర్మాణాలు తుది దశకు చేరుకోవడానికి విశేష కృషి చేసి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చి దిద్దిన మండల అభివృద్ధి ప్రత్యేక అధికారి సేహెచ్ కెవి చౌదరి, వెటర్నరీ ఏడీ ఎల్.అనిత, తహసిల్దార్ జి.లక్ష్మీపతి, ఎంపిడిఓ జేఏ ఝాన్సీ, మండల వ్యవసాయ అధికారి ఎస్.లక్ష్మి లావణ్యకు ఈ సత్కారం చేసినట్లు సర్పంచ్ రాంబాబు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ఆదేశాలు కనుగుణంగా అన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రగతి పథంలో నిలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.