విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి. గన్నవరం మండలం లోని ముంగండ గ్రామం లో నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ డి.ఈ వి.చంద్రశేఖర్, ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ సోమవారం పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దాసరి సత్యనారాయణ, తదితరులు పాల్గన్నారు.