విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, యానాం:
యానాం ( విశ్వం వాయిస్ న్యూస్,)
మీ అందరి దీవెనలు మరియు సహాయసహకారాల తో నేను మీ ఎమ్మెల్యే విజయం సాధించి, మొదటి సంవత్సరం దిగ్విజయం గా పూర్తి చేసిన సందర్భంగా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
నా విజయం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన మన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు యానాం ప్రజల కోరిక మేరకు మే నెల 8 తేదీ , సమయం 10.30 గంటల కు యానాం బీచ్ రోడ్ నందు భారీ బహిరంగసభ ఏర్పాటు చెయ్యడం జరుగుతున్నది.
కావున మే , 8 తేదీ న జరిగే ఈ ఆత్మీయ సభ కు ప్రతి ఒక్కరూ హాజరు కావలసినది గా , యానాం మరియు పరిసర ప్రాంత ప్రజల అందరినీ పేరు పేరు న నేను ఆహ్వానిస్తున్నాను.
ఈ సభకు ముఖ్య అతిథులుగా మన పుదుచ్చేరి స్పీకర్ ఎంబ్లం సెల్వం గారు మరియు ఇతర పుదుచ్చేరి ఎమ్మెల్యే లు హాజరు అవుతున్నారు.
సభా వేదిక దగ్గర మే, 8 తేది మధ్యాహ్నం యానాం ప్రజలు అందరికీ భోజనాలు ఏర్పాట్లు మరియు బస్ సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగినది అని గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు.