విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): ఎండలు మండి పోతుండటంతో ప్రయాణికులు అల్లాడి పోతున్నారు.వారికోసం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై మంగళవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. పుగాకు ఆఫీస్ ఏరియా యువకులంతా కలిసి మజ్జిగను జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు అందించి గొంతు తడిపారు.అటు రాజమహేంద్రవరం వైపు వెళ్లే రోడ్డులోను ఇటు రావులపాలెం వైపు వెళ్ళే రోడ్డులోను వాహన దారుల దాహర్తిని తీర్చారు. మండుటెండలో యువకులు వాహనాలు ఆపి మజ్జిగ అందజేశారు. ఆర్టీసీ బస్సులను కూడా ఆపి యువకులు మజ్జిగ అందిస్తూ అందరిమన్నలను అందుకున్నారు.