విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం,:
వి.ఆర్.పురం,(విశ్వం వాయిస్ న్యూస్) 03;- :క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని,యు.టి.ఎఫ్ సీనియర్ నాయకులు సున్నం. రాజులు అన్నారు మంగళవారం నాడు వి.ఆర్.పురం మండలంలోని అడివివెంకన్నగూడెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కామ్రేడ్. కుంజా.బోజ్జి,సున్నం. రాజయ్య గార్ల మెగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు మ్యాచ్ లను యు.టి.ఎఫ్ నాయకులు సున్నం. రాజులు గారు,చిన్నమట్టపల్లి సర్పంచ్ పిట్టా.రామారావుగారు,ప్రారంభించారు. క్రీడాకారులను ఉదేశించి వారు మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని,చిన్నతనం నుంచే క్రీడల పట్లా ఆసక్తి పెంచుకోవాలని,క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు, ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.యం.పార్టీ మండల కార్యదర్శి బొప్పెన. కిరణ్,సి.పి.యం.జిల్లా నాయకులు పూనెం.సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆసు. లక్ష్మయ్య, శ్రీరామగిరి సర్పంచ్ పులి. సంతోష్,చిన్నమట్టపల్లి ఎంపీటీసీ పూనెం.ప్రదీప్, కారం.సుందరయ్య, జనయ్య, ఫ్రెండ్స్ యుత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..