Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మాచర గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్సి తోట.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )మాచరగ్రామంలో పలు అభివృధ్ది కార్యక్రమాలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర0, పశువుల ఆసుపత్రి,సచివాలయంలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతులకు భూమి పూజ చేసారు.అనంతరం పాటశాల ఆవరణలో నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ తోట మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్యం,వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తోట త్రిమూర్తులు తెలిపారు. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు రాయితీ ఎరువులు,విత్తనాలు, ఆధునిక యంత్ర పరికరాలు, భూసార పరీక్షలు, సాగు సలహాలు వంటి పలు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తోట త్రిమూర్తులు తెలియ చేశారు. వ్యవసాయ అనుబంధ వృత్తి అయిన పశువుల పెంపకం ప్రోత్సాహం ద్వారా రైతులకు అదనపు ఆదాయం పొందుటకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారన్నారు. నాడునే డు వంటి బృహతర పథకం ద్వారా ప్రభుత్వ పాటశాల ల రూపురేఖలు మారిపోయాయని ఎమ్ ఎల్ సీ తోట తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్లమూరు గ్రామ క్లస్టర్ పరిథిలో రైతులకు వరి కోత యంత్రంను అందచేశారు. ఎంపీపీ మేడిసెట్టి సత్యవేని దుర్గా రావు,సర్పంచ్ వాసంసెట్టి సునీత విష్ణుమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, ఎంపీటీసీ శీలం సూర్య కుమారి, వైస్ ప్రెసిడెంట్ అడపా వేణు బాబ్జీ, మట్ట వెంకట పతి నాయుడు, అడపా శేషారావు, రాయుడు జగపతి, మేడిశెట్టి శ్రీనివాస్, సుంకర మూలా స్వామి,ఆచంట వీర స్వామి, వంగా నల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు,అంగర సర్పంచ్ వాసా కోటేశ్వర రావు, ఎంపీటీసీ మేడిశెట్టిదుర్గారావు, ఎంపిడివో వెంకట్రామన్, తహసిల్దార్ చిన్నా రావు, ఏ ఓ. రమేష్ కుమార్,ఈ ఓ పి ఆర్ డి రామకృష్ణ రెడ్డి , కార్యదర్శి చిన బాబు,సచివాలయం సిబ్బంది, వాలెంటీర్లు ప్రభుత్వ సిబ్బంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement