Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రాధాన రోడ్లు ఆధునీకరణ మూడునాళ ముచ్చటేనా??

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

# కొద్దిపాటి వర్షనికే నీరు నిల్వ
#పట్టించుకోని సంబంధిత శాఖ
#నెగ్గిపూడి స్థానికుల ఆవేదన
#పెద్ద మెటల్ డిప్ నిర్మాణంతో సమస్య పరిస్కారం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:

పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
శుక్రవారం పడిన కొద్దిపాటి వర్షానికి నిడదవోలు – నర్సాపురం ప్రధాన రహదారులు వర్షపు నీటి నిల్వలతో దర్శనమిచ్చాయి.వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలు నరకయాతన ప్రయాణం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా నిడదవోలు నుండి నర్సాపురం ప్రధాన రహదారులను ప్రైవేటు కాంట్రాక్టు ద్వారా క్రొత్త తారు రోడ్డులతో ఆధునీకరణ చేస్తున్నారు.అయితే నెగ్గిపూడి స్టేట్ బ్యాంక్,సాయి ఐడియా షోరూము మధ్య ప్రాంతంలో చిన్న పాటి వర్షం కురిస్తే చాలు పెద్ద ఎత్తున నీటి నిల్వలతో బురదమయంగా మారి అనతికాలంలోనే రోడ్డు పాడైపోతుందని,భారీవర్షాలు కురిస్తే సమస్య మొదటి కొస్తుందనీ,రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రోడ్డు పనులు అనతికాలంలోనే పాడైపోయి,ప్రభుత్వ నిధులు నష్టంతో పాటు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు సైతం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.క్రొత్తగా రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి,రోడ్డు భవన శాఖ అధికారులకు ఈ సమస్య గురించి వివరంగా చెప్పారని సమాచారం.అయినప్పటికీ పెడచెవిన పెట్టడంతో తిరిగి యథాస్థానంలో పెద్ద ఎత్తున గోతులతో ప్రమాదం పొంచి ఉంటుందనీ స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు ,ఇప్పటికైనా అధికారులు,కాంట్రాక్టు సిబ్బంది కళ్ళు తెరిచి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలనీ స్థానికుల కోరుకుంటున్నాను.ఈ విషయంలో స్ధానిక ఒకటవ వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొర మాట్లాడుతూ ప్రధాన రహదారులుపై, మార్జిన్ బెరమ్ప్ వెంబడి సరైన నీటి వాలులు ఏర్పాటు చేయకపోవడం వల్ల రోడ్లు పాడైపోవడంలో గతంలో రహదారులు-భవనాలు శాఖ అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గత వర్షాకాలంలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరి రోడ్లు పాడైపోయి,గోతులు ఏర్పడిన సందర్భంలో స్ధానిక ప్రజల వినతితో నాటి గృహనిర్మాణశాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాలతో నెగ్గిపూడి గ్రామపంచాయితి నిధులు వెచ్చించి మార్జిన్ బెరమ్ప్ ఏర్పాటుతో వర్షపు నీరు పారుదల చేయడం జరిగిందని, నేడు మరల పెద్ద మెటల్తో డిప్ నిర్మించకపోవడంతో మరలా వర్షపు నీటి నిల్వలు నిలిచి రోడ్డు అనతికాలంలోనే పాడైపోయే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు వెంటనే డిప్ నిర్మించి వర్షపు నీటి వాలును ఏర్పాటు చేయాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement