విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అన్నవరం:
……………………………………………………………………..
అన్నవరం, విశ్వం వాయిస్ న్యూస్: విద్యానిధి….. కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు శనివారం సందర్భంగా అత్యంత వైభవంగా శ్రీ సత్య దేవుని ప్రాకార సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గర్భాలయంలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకువచ్చి వివిధ రకముల సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించి తిరుచ్చివాహనంపై ఆశీనులు గావించి వేదపండితుల మంత్రోచ్ఛరణ భక్తుల నామస్మరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకుడు ఎడవెల్లి వెంకటేశ్వర్లు, పరిచారకుడు అగ్నిహోత్రి శాస్త్రి ,ఆలయ సూపర్డెంట్ తాడి గుర్రాజు, సిబ్బంది పాల్గొన్నారు.