విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుగొండ:
పెనుగొండ:(విశ్వంవాయిస్ ప్రతినిధి)
అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని పెనుగొండ మండల తెలుగుయువత అధ్యక్షుడు మండా ప్రసాద్
అన్నారు. ఆదివారం పెనుగొండలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 5న ఆచంటలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పితాని వైసీపీ నేతల ముసుగులో ఉన్న మాఫియా అవినీతిపైనే మాట్లాడారని, ఎస్సీలపై మాట్లాడారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేయడం అర్థరహితమని మండా ప్రసాద్ అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో పితాని స్థానిక సర్పంచ్ పై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని .కులాల ప్రస్తావనే రాలేదన్నారు.,ఈ సమావేశంలో కటికిరెడ్డి నానాజీ, గంధం వెంకటరాజు, వేండ్ర రాము, మద్దిoశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.