ప్రభుత్వాలు విఫలం
– అక్రమ గృహ నిర్భందాలను ఖండించిన.. సీపీఐ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 9 తేదీన అనగా రేపు “చలో విజయవాడ సెక్రటరియేట్” వద్ద అధిక ధరలను నియంత్రించాలని ఆందోళన చేయుటకు పిలుపు. చలో విజయవాడ కు వెళ్లనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ సిపిఐ నాయకులను ముందస్తుగా గృహ నిర్భందాలు చేస్తున్నారని తోకల ప్రసాద్ పత్రిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా సెక్రెటరీ పెద్ది రెడ్ల సత్యనారాయణ సామర్లకోట ఎస్ ఐ ఫోన్ చేసి విజయవాడ వెళ్ళవద్దని వెళ్లేవాళ్లు లిస్టు ఇవ్వమని ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు అందజేశారని, కామారెడ్డి బోడకొండ ఇంటికి వెళ్లి నోటీసు అందజేశారు ప్రసాద్ అన్నారు. జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ జిల్లా లోవ రత్నం ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారని, ఆమె చలో విజయవాడ వెళ్ళుటకు ప్రయత్నం చేస్తుందని, టీ .అన్నవరం ఇంటివద్ద పోలీసులు పహారా కాస్తున్నారని, జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ తోకల ప్రసాద్ అను నన్ను ఉదయం నుండి అక్రమ గృహనిర్బంధం చేశారని విజయవాడ వెళ్లవద్దని పోలీసులు నోటీసులు అందజేశారని పేర్కొన్నారు .రోజు రోజుకి పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆయిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని, నిర్మాణ రంగంలో ఉన్న ముడిసరుకులు …ఇసుక , సిమెంట్, స్టీల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింట్స్, పిఓపి, వడ్రంగి, తదితర సామాగ్రి లపై అధిక ధరలను నియంత్రించాలని, ఆస్తి పన్ను తగ్గించాలని, యూజర్ చార్జీలు ఎత్తివేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని, అన్ని రకాల పన్నులు పెంచి విధిస్తూ కార్మిక, సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పై అధిక భారం మోపుతూ నడ్డి విరిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన ఉందని, ఈ ప్రభుత్వాలకుప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపునిచ్చింది. అధిక ధరల తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వాటికి పాలించే అర్హత లేదని, గద్దె దిగాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుందని, అధిక ధరలను నియంత్రించాలని, చలో విజయవాడ సెక్రటరియేట్ కు పిలుపునిస్తే విజయవాడ వెళ్లనివ్వకుండా ముందస్తుగా అక్రమ గృహ నిర్మాణాలు చేయడం సిగ్గుచేటని, అక్రమ గృహనిర్బంధంలతో ఉద్యమాలు ఆపలేరని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అధిక ధరలు నియంత్రించాలని తోకల ప్రసాద్ అన్నారు.