Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అభివృద్ధి సంక్షేమ పథకాల సమీక్ష

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్ న్యూస్: మండలం లో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై ఎంపీడీఓ నాతి బుజ్జి ఉపాధి హామీ సిబ్బందితో స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించి, జిల్లా అధికారులు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని గ్రామాలలో పనులు జరగాలనీ, సకాలంలో మస్తర్లు అన్నీ అప్లోడు చెయ్యాలని అన్నారు.అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు డిఆర్డిఎ సిబ్బంది తో హౌసింగ్ నిర్మాణాలపై సమీక్షించి, గృహ నిర్మాణాల కొరకు ముందుకు‌ వచ్చే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా ఫైనాన్స్ ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గృహనిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల ప్రగతి ని సమీక్షించారు.ఈ సమావేశం లో ఏపీఓ విజయ భారతి, ఏఓ రామస్వరూప్, ఈసీ చక్రపాణి, ఏపీఎం ధన్ రాజ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సాంకేతిక సహాయకులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement