తరుణం
– జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
జిల్లా వారసత్వ సంపద, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, పర్యావరణం తదితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొని, కాకినాడ ఫుట్ ప్రింట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ప్రసిద్ధ కట్టడాలు, కళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇన్టాక్ వారు కాకినాడ ఫుట్ ప్రింట్స్ అనే పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకం పర్యాటక ప్రేమికులకు మార్గదర్శిగానిలుస్తుందని ఆమె తెలిపారు. వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించే దిశగా ప్రతిఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. కొత్త జిల్లా కు తొలి కలెక్టర్‌గా వచ్చిన తాను జిల్లాలోని వివిధ ప్రదేశాలు సందర్శించానని, ఇంకా చాలా ప్రదేశాలు చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, ఇన్టాక్ తూర్పుగోదావరి చాప్టర్ కన్వీనర్ వీవీఎల్ఎన్ మూర్తి, ఇన్టాక్ ప్రతినిధులు రవిశంఖర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.