Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

స్పెస్ ప్రోగ్రామ్ తొలి భారతీయురాలు జహ్నవి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సన్నయ వీసి జగన్నాదరావు ప్రశంసలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్ (నాసా) యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (ఐఎపిఎస్)లో పాల్గొన్న మొదటి భారతీయురాలు గోదావరివాసి కావడం మనకు గర్వకారణమని, దంగేటి జాహ్నవి ని  ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు ప్రశంసించారు. యూనివర్సిటీ ఈసీ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు, భారత్ నుండి ఐ.ఎ.ఎస్.పి లో పాల్గొన్న దంగేటి జాహ్నవి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకు ప్రపంచ వ్యాప్తంగా చాలా కొద్దమంది మాత్రమే ఎంపికవుతారని అన్నారు. యు.ఎస్.ఎ లో జరిగిన ఐ.ఎ.పి.ఎస్ కు ప్రపంచవ్యాప్తంగా 60 మంది విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారని, దానిలో మొదటి సారిగా భారతదేశం నుండి తెలుగుతేజం, గోదావరివాసి దంగేటి జహ్నవి ఎంపికకావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. పాలకొల్లులోని నిరుపేద కుటుంబానికి జన్మించిన జాహ్నవి లక్ష్య సాధనకు ఎంతో కృషి చేస్తుందని యువత ఇటువంటి వారిని స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. జహ్నవి సంకల్ప శుష్కమైన చొరవ ఆమెకు అవసరమైన లక్ష్యాలను సాధించేలా చేసిందన్నారు. వివిధ దశలను దాటి వ్యోమగామిగా శిక్షణ కూడా పొందిందన్నారు.  జీరో గ్రావిటీతో సహా కార్యక్రమాలు,  మల్టీ-యాక్సెస్ ట్రైనియుగ్ మరియు అండర్ వాటర్ రాకెట్ లాంచ్ చేసారన్నారు.  శిక్షణలో భాగంగా మొదటిసారిగా సెస్నా 172 విమానాన్ని కూడా నడిపారని తెలియజేసారు. పూర్తి స్థాయిలో పైలెట్ ట్రైనింగ్ పొంది స్పేస్ లోనికి వెల్లాలనే ధృడ సంకల్పంతో జాహ్నవి సాధన చేస్తుందన్నారు. విదేశాలలో పైలెట్ ట్రైనింగ్, లైసెన్స్ నిమిత్తం తనకు సహకారం ఎంతో అవసరమని సహృదయంతో జాహ్నవికి సహకరించి తెలుగువారి ఖ్యాతిని విశ్వంలో చాటేవిధంగా నిలపాలన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తరుపున జాహ్నవి కి సహకారం అందిస్తున్నామని తెలియజేసారు. జాహ్నవి దంగేటి మాట్లాడుతూ చిన్నతనంలో బామ చెప్పిన చందమామ కథలు నిజం చేయాలనే ఆలోచనతోనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే మొదటి భారతీయురాలు కావాలనే కల నిజమైందన్నారు. పూర్తి స్థాయిలో పైలెట్ ట్రైనింగ్ పొంది స్పేస్ లోనికి వెళ్ళి భారతదేశ జెండాను ఎగురవేయాలని లక్ష్యంతో సాధన చేస్తున్నానని చెప్పారు. శిక్షణ, లైసెన్స్ నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలను కోరుతున్నామని తెలిపారు. కొంత సహకారాన్ని అందిస్తే అంతరిక్షంలో భారతదేశం తరుపున అడుగుపెడతానని తెలియజేసారు. తొలిసారిగా తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహాన్ని అందించిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావుకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జిల్లాల విశ్వవిద్యాలయమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటానని ఆకాంక్షించారు. అనంతరం జాహ్నవి ని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ఓ.ఎస్.డి. ఎస్.టేకి, ప్రిన్సిపాల్ డా.వి.పెర్సిస్, డా.కె.రమణేశ్వరి, జహ్నవి తల్లి పద్మశ్రీ, కుడుపూడి సారిధి, కుడుపూడి సత్తిబాబు, యూనివర్సిటీ డీన్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రైటప్: జాహ్నవి ని సన్మానించి జ్ఞాపికతో అభినందిస్తున్న వీసీ

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement