Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పరిపాలన వికెంద్రికరణ.. పాలన సౌలభ్యం అంశంపై విద్యార్థులతో చర్చ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ప్రభుత్వ పాలనపై అభిప్రాయసేకరణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

జెఎన్టియుకె ప్రాంగణంలో గురువారం ఉదయం అలూమ్ని ఆడిటోరియం నందు జెఎన్టియుకె యూనివర్శిటీ మరియు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ( బిసిడిఈ ) , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో “ పరిపాలన వికేంద్రీకరణ – పాలనా సౌలభ్యం ” అనే అంశంపై జెఎన్టియుకె, అనుబంధ కళాశాలల విద్యార్థులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసిడిఈ ఛైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ విచ్చేయగా జెఎన్టియుకె ఉపకులపతి ప్రొ.జి.వి.ఆర్.ప్రసాదరాజు విశిష్ట అతిథిగాను , రెక్టార్ ప్రొ.కె.వి.రమణ , రిజిస్ట్రార్ ప్రొ.ఎల్.సుమలత , బిసిడిఈ సెక్రటరీ, సిఇఓ ప్రొ.ఎం.ఎల్.ఎస్.దేవకుమార్ గౌరవ అతిథిలుగా పాల్గొన్నారు . జెఎన్టియుకె కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ నోడల్ ఆఫీసర్ డా.కె. వెంకటరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించి స్వాగతం పలికారు . ఈ సందర్భంగా బిసిడిఈ ఛైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో లోటుపాట్లను , ప్రజల జీవన విధానాలను తెలుసుకుని వాటిపై సమీక్షించి మెరుగైన పాలన అందించాలనే భావనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డును ప్రారంభించడం జరిగిందన్నారు.విద్యార్థులు అందరూ సమాజాభివృద్ధి కొరకు ఈ వ్యవస్థతో కలిసి పనిచేయాలని కోరారు . రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు , ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు ఈ వ్యవస్థను తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించకుండా వికేంద్రీకరణ ద్వారా భావితరాలకు, యువతకు మంచి భవిష్యత్తును అందించాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అన్నారు . రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోగా అధిక సంఖ్యలో విద్యార్థులు వికేంద్రీకరణపై వారి అభిప్రాయాలను నేదురుమల్లి రామ్కుమార్ తో పంచుకున్నారు.ఉపకులపతి ప్రొ.జి.వి.ఆర్.ప్రసాదరాజు మాట్లాడుతూ బిసిడిఈ ఛైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ జెఎన్టియుకె విశ్వవిద్యాలయానికి రావడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు.రాష్ట్రంలో మంచి పాలన అందించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.ఈ బోర్డు ద్వారా విద్యార్థులు ప్రజల యొక్క జీవన స్థితిగతులను తెలుసుకుని మెరుగైన పాలన అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.రానున్న రోజుల్లో తమ విశ్వవిద్యాలయం బిసిడిఈ బోర్డుతో కలిసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్న రూపొందించి విద్యార్థులకు క్రెడిట్ పాయింట్స్ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.ఇప్పటికే 100 కు పైగా జెఎన్టియుకె అనుబంధ కళాశాలల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి 100 మంది నోడల్ అధికారులను నియమించామని , 7 వేల మందికి పైగా వాలంటీర్లను గుర్తించి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు . ఈ కార్యక్రమంలో జెఎన్టియుకె డైరెక్టర్లు , స్పెషల్ ఆఫీసర్లు , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ వై.డి.రామారావు , కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్స్ నుండి డా.ఎస్.సిహెచ్.ఎస్.రామకృష్ణ , ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుండి ఎన్.టి.పి.ప్రసాద్ వర్మ , జెఎన్టియుకె, అనుబంధ కళాశాలల నుండి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ నోడల్ అధికారులు , 500 మంది వరకు వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement