విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) కోరుమిల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దివ్య కళ్యాణ0 శాస్త్రోత్సవంగ నిర్వహించారు. ప్రతి యేటా వైశాఖ శుద్ద ఏకాదశి రోజున స్వామి వారి దివ్య కళ్యాణ0 ఆనవాయితీగా చేస్తున్నారు.దేవస్తాన0 పండితులు ఖడవిల్లి వెంకట పెరుమాళ్ ఆచార్యులు గ్రామ స్తుల సమక్షంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దివ్య కళ్యాణం నిర్వహించారు. పాలూరి వెంకట రమణ దంపతులు పీటల మీద ఆశీ సులయి స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించారు.దేవ దాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ శ్రీని వాస్ రాజు, గ్రామ వైసీపీ అధ్యక్షుడు ఆచంట వీర వెంకటస్వామి,కార్యదర్శి సుంకర మూలస్వామి, మాజీ డి సీ సి బీ డైరెక్టర్ సలాదిఅప్పారావు, పేరాబ త్తుల శివ శంకర్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.