Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎస్సై ఆత్మహత్య కు కారకులెవరు?

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లా పోలీసు వ్యవస్థను కుడిపేసిన విషాద ఘటన
– సర్వీస్ రివాల్వర్ తో కన్నుమూసిన గోపాలకృష్ణ
– ఉన్నత అధికారుల వీధింపులే కారణమా?
– సర్పవరం స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహణ
– ఎస్సై గోపాలకృష్ణ మృతిపై అనేక అనుమానాలు
– భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు.. అన్ని
కోణాల్లోను ప్రత్యేక దర్యాప్తు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

పోలీసు వ్యవస్థను కుదిపేసిన సంఘటన గ్రామీణంలో చోటు చేసుకుంది. రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ తన సర్వీస్ రివాల్వర్ తో ఈరోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున నాగమల్లి తోట జంక్షన్ సమీపం లో వున్న తాను అద్దెకు ఉంటున్న నివాసంలో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపారు. భార్య తన ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా పక్క గదిలోకి వెళ్లి తన సర్వీస్ రివాల్వర్ తో సుమారు 5 గంటల సమయంలో కణత గుండా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో పక్క గదిలో నిద్రిస్తున్న గోపాలకృష్ణ భార్య అయిన పావని చూచి ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొన ఊపిరితో వున్న తన భర్త గోపాలకృష్ణ పరిస్థితిని తెలిసిన పోలీసులకు సమాచారం అందించడం జరిగింది అన్నారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన దగ్గర్లో ఉన్న వినోదయ ఆసుపత్రికి తీసుకు వెళ్లారని చెప్పారు. అప్పటికే ఎస్సై గోపాలకృష్ణ తన ప్రాణాలను విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు చెప్పారు. ముఖ్యంగా గోపాలకృష్ణ మృతిపై భార్య మాట్లాడినా మాటలకు… ఉన్నతాధికారులు తెలిపిన వివరాలకు పొంతన లేకుండా పోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది. నిన్నటి రోజున సీఎం కోనసీమ జిల్లా పర్యటన నిమిత్తం ఏర్పాట్లకు బందోబస్తుకు వెళ్లిన గోపాలకృష్ణ రాత్రి 10 గంటల సమయానికి ఇంటికి చేరుకున్నారని, బందోబస్తుకు వెళ్లే ముందే రెండు రోజులు సెలవు కావాలని కోరడం…? ఈ సమయంలో సెలవు ఇవ్వడం కుదరదని ఉన్నతాధికారులు తెలపడం..? ఉదయం 5 గంటలకు ఆత్మహత్యకు పాల్పడడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అందరి మదిలోను మెదిలే సందేహాలు. పోలీస్ ఉద్యోగం గోపాలకృష్ణ కు ఇష్టం లేదని, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని తప్పు చేశానా.. అంటూ గోపాలకృష్ణ తనలో తాను కుమిలిపోవడం జరిగేది అంటూ భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారంట… 2014 బ్యాచ్ తో ఎస్సై గోపాలకృష్ణ పోలీసు వ్యవస్థలో అడుగు పెట్టారని, అప్పటి నుంచి డొంకరాయి, సర్పవరం, ట్రాఫిక్ పోలీస్ గా విధులు నిర్వహించిన గోపాలకృష్ణ 2021 ఆగస్టు నెలలో సర్పవరం రావడం జరిగిందన్నారు. సుమారు ఎనిమిది సంవత్సరాలు ఇష్టము లేని కొలువు ఎలా చేశారు అనేది ప్రశ్నార్థకం.
పై స్థాయి అధికారుల ఒత్తిడి, ప్రమోషన్ నిమిత్తం వేధింపులు అంటూ పోలీసు వ్యవస్థలోనే అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము అనేది తోటి సిబ్బంది ఆవేదన.. పోస్టుమార్టం అనంతరం గోపాలకృష్ణ మృతదేహాన్ని జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఆంబులెన్స్ లో అతని స్వగ్రామమైన కృష్ణాజిల్లా, నవాబ్ పేట కు తరలించడం జరిగింది అన్నారు. అంత్యక్రియల నిమిత్తం కొత్త పిఆర్సి ప్రకారం 25 వేల రూపాయలు గోపాలకృష్ణ తండ్రికి ఏలూరు రేంజ్ డిఐజి జి. పాలరాజు అందజేయడం జరిగిందన్నారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు గాను మృతదేహం వెంట ట్రాఫిక్ డిఎస్పి మురళి కృష్ణ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తోటి ఎస్ఐలు, సిబ్బందిని జిల్లా నుండి పంపినట్లుగా ఎస్పీ తెలియజేశారు. అనంతరం ఎస్సై గోపాలకృష్ణ కు పోలీస్ అధికారులు ఘన నివాళులు అర్పించారు. ఎస్సై కుటుంబానికి పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement