విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
ఇటీవల అసని తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది శనివారం ఉందయంఅమలాపురం రూరల్ మండలం నల్లమిల్లి నడిపూడి జనపల్లి తదితర గ్రామాల్లో సిపిఎం పార్టీ బృందం పర్యటన చేశారు ఈ సందర్భంగా రైతులు కళ్ళాలలో తడిసిన ధాన్యాన్ని వారు పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అసని తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ తుఫాను కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు మేము తిరిగిన గ్రామాలలో వ్యవసాయం శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రాల అధికారులు ఆయా గ్రామాల్లో పంట నష్టపోయిన పొలాల్ని పరిశీలన చేయలేదని రైతులు వాపోతున్నారు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే చర్యలు ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ఎంత శాతం పంట నష్టపరిహారం జరిగిందనే అంచనా తక్షణం ప్రభుత్వం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారురైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు లోపభూయిష్టంగా జరుగుతుందని రైతుల ద్వారా ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ధాన్యం వ్యాపారుల వడ్డీ వ్యాపారులు ద్వారా భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది వారు ఒక బస్తా కి 300/రూ 400/రూ రైతాంగానికి తక్కువ చెల్లిస్తున్నారు దీని వల్ల రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాపారుల ద్వారా కొనుగోలు చేసే పద్ధతిని విరమించుకోవాలి ప్రత్యక్షంగా రైతులు కౌలు రైతుల ద్వారా కొనుగోలు చేయాలను ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మ గ్రామాలలో 20 శాతం వరకూ పంట నష్టం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని 11 21 రకం దాన్యం ఒకరోజు తడిస్తేనే మొలకలు వస్తున్నాయని కురిసిన వర్షాలకు నిలుచున్న వరి చేనులో లో కూడా వెన్నులోంచి మొలకలు వస్తున్నాయని పంట నష్టాన్ని తక్షణం ప్రభుత్వం అంచనా వేయాలని ఆయన డిమాండ్ చేశారుఅసని తుఫాన్ వల్ల వీచిన గాలులకు అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు పర్యటించిన బృదం లో సిపిఎం పార్టీ అమలాపురం కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు పశ్చిమ వసంత కుమార్ రైతులు రమనాతి బాలయోగి అప్పారి దుర్గారావుమటట్టపర్తి సత్యనారాయణ మట్టపర్తి సత్యనారాయణ రమణ అరిగెల వెంకట వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు