Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

డ్వాక్రా మహిళల చెక్కుల పై పోర్జరీ సంతకాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

త్తతపూడి గ్రామం డ్వాక్రా మహిళలు చేసిన రూ. 4 లక్షల35 వేలు
రూపాయలు తాను స్వాహ చేసినట్లు ఆరోపణల్లో వాస్తవం లేదు.
ఆనాటి యానిమీటర్ కొల్లా నాగరాణి.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వంవాయిస్)
సుమారు 4 లక్షల35 వేలు రూపాయలు డ్వాక్రా మహిళల గ్రూప్ ల స్త్రీ నిది, సి. ఐ ఎఫ్ నిధులు బ్యాంక్ నుండి తాను చెక్కుల పై ఫోర్జరీ సంతకాలు చేసి స్వహా చేసినట్లు వచ్చిన ఆరోపణ లో వాస్తవం లేదని ఆరోపణనలు ఎదుర్కొంటున్న ఆనాటి ఏనిమేటర్ కొల్లాటి నాగరాణి అన్నారు. కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన కొల్లాటి నాగ రాణి 2010 నుండి 2014 వరకు డ్వాక్రా ఏని మేటర్ అదే గ్రామ0లో పనిచేశారు. ఆమె పనిచేసిన కాలంలో 4 లక్షల 35 వేలు రూపాయిలు బ్యాంక్ చెక్కుల పై ఫోర్జరీ చేసి స్వాహా చేసిందని ఆ గ్రామ డ్వాక్రా మహిళలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఒక అధికారిగా ఏ విధమయిన విచారణ చేపట్టకుండా మండల ఏ పీ ఎమ్ తౌడుబాబు మీడియా ముందు వాళ్లకి వత్తాసు పలకడం తన పరువుకు భంగం కలిగిందని నాగరాణి వాపోయారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామ ఐ కే పీ కార్యాలయంలో వున్న ఏ పీ ఎమ్ తౌడు బాబు ని కలసి తన పై వచ్చినవి నిరాధార ఆరోపణలు అని తాను ఏనిమేటర్ గా తప్పుకొని 9 సంవత్సరాలు
అయిందన్నారు. ప్రస్తుతం తాను కపిలేశ్వరపురం గ్రామంలో సచివాలయం మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నాను అన్నారు. తనపై గ్రామంలో వ్యక్తిగత కక్షతో కొందరు చేస్తున్న నిరాధార ఆరోపణలు ను మీరు ఎలా సమర్ధి0చారని ఏ పీ ఎమ్ ని కొల్లాటి నాగ రాణి నిలదీశారు. దీనిపై డ్వాక్రా అధికారిగా మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొనక పోతే పరువునష్టం దావా వేస్తానని ఆమె హెచ్చరించారు. ఈ వివాదంపై సమగ్రంగా విచారణ జరిపి సోమవారం నాడు వ్రాత పూర్వకంగా వివరణ ఇస్తానని ఐకేపీ ఏ పీ ఎమ్ తౌడుబాబు మీడియా సమక్షంలో చెప్పారు. సోమవారం నాడు మీ ఆరోపణలు వెనక్కి తీసుకోలేక పోతే ఐకేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాలమహానాడు నాయుకు డు బత్తుల గోవింద రాజు, కొల్లాటి వెంకటేశ్వరరావు లు హెచ్చరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement