– ఫిర్యాదుల తో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య
– జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు, ఈ రోజున జిల్లా పోలీసు కార్యాలయం నందు ” స్పందన” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యక్షంగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో మాట్లాడి, వారి సమస్యలను విని, సమస్యలను సత్వరం పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తగు ఆదేశాలను జారీ చేసారు. ఈ రోజు నిర్వహించిన “స్పందన” కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు రాగా (మహిళలు-16, పురుషులు-16) వాటిలో సివిల్ వివాదాలకు సంబంధించి-16, కుటుంబ తగాదాలు-04, ఇతర సమస్యలకు సంబంధించిన 12 అందినాయని, సదరు ఫిర్యాదులపై సమగ్ర విశ్లేషణ చేసి, సంబంధిత సర్కిల్, స్టేషన్ అధికారులకు సత్వరం విచారణ పూర్తి చేసి, పరిష్కారం కొరకు తగు సూచనలను,ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పి.శ్రీనివాస్,అడిషనల్ ఎస్పీ (ఎఆర్) బి.సత్యనారాయణ, స్థానిక ఎస్ డి పి వో వి.భీమారావు, దిశ డిఎస్పీ సుంకర మురళీమోహన్, పట్టణ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.